Narendra Modi: చంద్రబాబు నెక్ట్స్ స్టెప్... నేడు కోల్ కతాకు!

  • నరేంద్ర మోదీని గద్దె దించేందుకు వ్యూహాలు
  • మధ్యాహ్నం నుంచి కోల్ కతాకు పయనం
  • సాయంత్రం మమతా బెనర్జీతో చర్చలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని, ఎన్డీయే సర్కారును గద్దె దింపడమే లక్ష్యంగా అడుగులేస్తూ, దీర్ఘకాల ప్రత్యర్థి కాంగ్రెస్ తో జతకట్టిన చంద్రబాబు, తన తదుపరి వ్యూహానికి పదును పెడుతున్నారు. ఈ క్రమంలో నేడు ఆయన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు వెళ్లి, సీఎం మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు.

ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు చంద్రబాబు ప్రత్యేక విమానంలో కోల్ కతాకు వెళ్లనుండగా, ఆయనతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు మమతా బెనర్జీతో సమావేశమయ్యే చంద్రబాబు, రానున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

సీబీఐని నిలువరించేందుకు రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న చట్టాలపైనా వీరిద్దరి మధ్యా చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది. ఆపై రాత్రికి ఆయన తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, ఈ నెల 22న ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, పలు బీజేపీయేతర జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలను కలిసి, కూటమి ఏర్పాటుపై చర్చించనున్నారు.

More Telugu News