సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత బాబూమోహన్ ఫైర్

18-11-2018 Sun 20:36
  • సూది కథలు చెప్పి దర్జీలను అవమానిస్తున్నారు
  • ఈ విషయమై దర్జీలు నా దగ్గర బాధపడ్డారు
  • ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బుపంచుతున్న కేసీఆర్
కేసీఆర్, కేటీఆర్ పై ఆందోల్ బీజేపీ నేత బాబూమోహన్ మండిపడ్డారు. సంగారెడ్డిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కట్టు కథలు, పిట్ట కథలు, సూది కథలు చెప్పి తండ్రీకొడుకులు అవమానిస్తున్నారని తనను కలిసిన దర్జీలు బాధపడ్డారని అన్నారు.

ఇలాంటి కథలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మునే తమ అభ్యర్థులకు ఆయన ఇస్తున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా మద్యం సరఫరా చేసేందుకు లారీల్లో దిగుమతి అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.