Chandrababu: చంద్రబాబుకు ఫోన్ చేసిన మమతా బెనర్జీ.. బాబు నిర్ణయాన్ని కొనియాడిన పశ్చిమబెంగాల్ సీఎం

  • జనరల్ కాన్సెంట్ రద్దుపై చంద్రబాబుకు ప్రశంస
  • పశ్చిమ బెంగాల్ కూడా రద్దు
  • రేపు కోల్‌కతా వెళ్లనున్న ఏపీ సీఎం
సీబీఐని రాష్ట్రంలో అడుపెట్టనీయకుండా సాధారణ సమ్మతి ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న చంద్రబాబుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. చంద్రబాబు నిర్ణయాన్ని ఆమె ప్రశంసించారు. సీబీఐని మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న తరుణంలో చక్కని నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. తాము కూడా సాధారణ సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు చంద్రబాబుకు తెలిపారు.

మరోవైపు, పశ్చిమబెంగాల్ కూడా సీబీఐకి రెడ్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో జారీ చేసిన సాధారణ సమ్మతి ఉత్తర్వులను శనివారం మమత ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన జీవో కాపీని ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అత్రి భట్టాచార్య సీబీఐకి పంపారు. కాగా, సోమవారం కోల్‌కతా వెళ్లి మమతను కలవనున్న చంద్రబాబు 22న బీజేపీయేతర పార్టీల నేతలతో ఢిల్లీలో సమావేశం కానున్నారు.
Chandrababu
Andhra Pradesh
West Bengal
Mamata banerjee

More Telugu News