Mahesh Babu: తన పాత్రను మహేష్ బాబు చేస్తే బాగుంటుందట... వీవీఎస్ లక్ష్మణ్ మనసులో మాట!

  • పుస్తకరూపంలో వీవీఎస్ స్వీయ చరిత్ర
  • సినిమాగా తీస్తే మహేష్ బాబు బాగుంటారు
  • వెల్లడించిన స్టైలిష్ బ్యాట్స్ మెన్ లక్ష్మణ్
తన బయోపిక్ ను చిత్రంగా తీస్తే, అందులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తే బాగుంటుందని అన్నాడు స్టైలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్. తనకు మహేష్ అంటే చాలా ఇష్టమని, ఆయన సినిమాలన్నీ తాను ఎంజాయ్ చేస్తానని తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు. తన జీవితకథ ఆధారంగా సినిమా తీస్తామంటూ రెండేళ్ల క్రితం బాలీవుడ్, టాలీవుడ్ దర్శకులు తనను సంప్రదించారని గుర్తు చేసుకున్న ఆయన, అప్పట్లో తన వివరాలను చెప్పలేకపోయానని అన్నారు.

ఇప్పుడు తన జీవిత కథను పుస్తక రూపంలో తెస్తున్నానని, దీనిలో అన్ని విషయాలూ ఉన్నాయని తెలిపారు. సినిమా పూర్తి వాస్తవికంగా ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. పెళ్లికి ముందు అమ్మ, నాన్న, మామయ్యలు, పెళ్లి తరువాత భార్య శైలజ తన జీవితంలో ప్రత్యేక వ్యక్తులని చెప్పారు. తన పిల్లలు భవిష్యత్తులో ఏ రంగాన్ని ఎంచుకుంటారన్న విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తానని, ప్రస్తుతం అబ్బాయి సర్వజిత్ ఏడో తరగతి, పాప అచింత్య 5వ తరగతి చదువుతున్నారని అన్నారు.
Mahesh Babu
VVS Lakshman
Bio-pic

More Telugu News