Jagan: నేను విశాఖలో అడుగుపెట్టినపుడే సీసీ కెమెరాలు ఆగిపోయాయి: దాడి ఘటనపై జగన్

  • గంటకే స్క్రీన్‌ప్లే మార్చేశారు
  • ప్రశ్నించినందుకే హత్యాయత్నం
  • నిందితుడి వద్ద లెటర్ కనిపించలేదు

విశాఖ ఎయిర్‌పోర్టులో తనపై జరిగిన దాడి విషయమై వైసీపీ అధినేత జగన్ తొలిసారి పెదవి విప్పారు. నేడు పార్వతీపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తనపై హత్యాయత్నం జరిగిన గంటకే స్క్రీన్‌ప్లే మార్చేశారన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌నే డీజీపీ చదవి వినిపిస్తున్నారని జగన్ ఆరోపించారు. అన్యాయమైన పాలనను ప్రశ్నించినందుకే తనను హత్య చేసేందుకు యత్నించారని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చంద్రబాబు సన్నిహితుడని పేర్కొన్నారు.

దాడి సమయంలో నిందితుడి వద్ద ఎలాంటి లెటర్ కనిపించలేదన్నారు. తాను విశాఖలో అడుగుపెట్టినపుడే సీసీ కెమెరాలు ఆగిపోయాయని.. అసలు మెరుగైన పాలన కోరుకునే అభిమాని తనపై దాడి ఎందుకు చేస్తాడని విమర్శించారు. తెలిసీ తెలియకుండా అభాండాలు వెయ్యొద్దనే ఒక్క కారణంగా తాను ఇప్పటి వరకూ ఈ ఘటనపై స్పందించలేదన్నారు. తనపై హత్యాయత్నం కుట్ర చేయకుంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఎందుకు ఒప్పుకోరని ప్రశ్నించారు. ఒకవేళ సీబీఐ విచారణ జరిగితే చంద్రబాబు జైలుకి వెళ్లాల్సి వస్తుందని వణికిపోతున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

More Telugu News