Chandrababu: చంద్రబాబే పెద్ద దళారి అయితే.. దళారీలను ఎవరు కట్టడి చేస్తారు?: జగన్

  • రోజుకో సినిమా చూపిస్తాడు
  • రుణాలు మాఫీ అయ్యాయా?
  • రైతులకు గిట్టుబాటు ధరల్లేవు
ముఖ్యమంత్రి చంద్రబాబే పెద్ద దళారి అయితే.. ఇక దళారీలను కట్టడి చేసేవాడు ఎవరంటూ వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. నేడు పార్వతీపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎన్నికల ముందు రుణమాఫీ అన్నాడు. ఎన్నికలైపోయాయి. మీ రుణాలు మాఫీ అయ్యాయా? అని అడుగుతున్నా. చంద్రబాబునాయుడుగారి హయంలో రుణమాఫీ జరగలేదు కానీ రోజుకో సినిమా చూపిస్తాడు. రుణాలు మాఫీ అయ్యాయని.. రైతులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారని చెబుతాడు.

రెండో సినిమాలో పొదుపు సంఘాల అక్కచెల్లెళ్లు రుణమాఫీ కారణంగా ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నారంటాడు. రైతులకు గిట్టుబాటు ధరల్లేవు. గిట్టుబాటు ధరలను కల్పించాలంటే ముఖ్యమంత్రిగా దళారులను కట్టడి చేయాల్సిన చంద్రబాబు తానే దళారీలకు నాయకుడైపోయాడు. తన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మూడు, నాలుగు రెట్లకు అమ్ముకుంటాడు. ముఖ్యమంత్రే దళారి అయితే దళారీలను కట్టడి చేసేవాడు ఎవరని అడుగుతున్నా’’ అంటూ జగన్ మండిపడ్డారు.

Chandrababu
Jagan
Parvathipuram

More Telugu News