Jagan: ఒకరోజు బాహుబలి సెట్టింగ్‌లు.. మరోరోజు సింగపూర్ సెట్టింగ్‌లు అంటాడు: జగన్

  • రాజధాని ఇది అంటూ గ్రాఫిక్స్ చూపించాడు
  • ఇంకోరోజు జపాన్.. మరోరోజు లండన్ సెట్టింగ్‌లంటాడు
  • పర్మినెంట్ పేరుతో ఒక్క ఇటుక కూడా పెట్టలేదు
ముఖ్యమంత్రి చంద్రబాబు నేటికీ రాజధానికి సంబంధించిన గ్రాఫిక్స్‌తోనే కాలం గడుపుతున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. నేడు పార్వతీపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘2014 ఎన్నికలప్పుడు చంద్రబాబుగారు నేను కట్టబోయే రాజధాని ఇది అంటూ మనందరికీ గ్రాఫిక్స్ చూపించాడు. ఎన్నికలై పోయాయి.. 2019 ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకా మనకు గ్రాఫిక్స్ చూపిస్తూ.....నే ఉన్నాడు. ఒకరోజు బాహుబలి సెట్టింగ్‌లంటాడు.. మరోరోజు సింగపూర్ సెట్టింగ్‌లు అంటాడు. ఇంకోరోజు జపాన్ సెట్టింగ్‌లంటాడు. మరోరోజు లండన్ అంటాడు. నాలుగున్నరేళ్లలో ఆ రాజధాని ప్రాంతంలో పర్మినెంట్ అనే ఒక్క పేరుతో కనీసం ఒక్క ఇటుక కూడా ఇంతవరకూ పడలేదు కానీ మనకు మాత్రం గ్రాఫిక్స్‌తో సినిమా చూపిస్తూ......నే ఉన్నాడు’’ అంటూ చంద్రబాబును జగన్ ఎద్దేవా చేశారు.
Jagan
Chandrababu
Parvathipuram
Bahubali

More Telugu News