Telangana: కొడంగల్ లో ఈసీ అధికారులు నన్ను వేధించారు.. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

  • కొత్తకొత్త నిబంధనల పేర్లు చెప్పారు
  • ప్రగతిభవన్ టీఆర్ఎస్ ఆఫీసుగా మారింది
  • ఈసీ అధికారులు వివక్ష చూపుతున్నారు

కొడంగల్ లో నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సందర్భంగా ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు తనను వేధించారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ను టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చేశారని విమర్శించారు. ఈసీ అధికారులు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు.

కాంగ్రెస్ నేత అరవింద్ రెడ్డికి ప్రగతి భవన్ లో కేసీఆర్ టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారని రేవంత్ గుర్తుచేశారు. అలాగే దానం నాగేందర్ కు మంత్రి కేటీఆర్ సైతం ప్రగతి భవన్ లోనే బీఫామ్ అందించారన్నారు. ఇలా ముఖ్యమంత్రి నివాసాన్ని సైతం పార్టీ కార్యాలయంగా మార్చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల నేపథ్యంలో ఈసీ అధికారులు అధికార, ప్రతిపక్షాల మధ్య వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

కొడంగల్ లో నామినేషన్ దాఖలు సందర్భంగా కొత్తకొత్త నిబంధనలు చెబుతూ ఈసీ అధికారులు తనను ఇబ్బంది పెట్టారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రయోజనాలకు టీఆర్ఎస్ నేతలు వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ సంఘటనలపై ఈసీ చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News