కూకట్ పల్లిలో నామినేషన్ దాఖలు చేసిన నందమూరి సుహాసిని!

  • వెంటవచ్చిన బాలయ్య, పెద్దిరెడ్డి
  • భారీగా హాజరైన టీడీపీ శ్రేణులు
  • కార్యకర్తలతో భేటీ కానున్న సుహాసిని
మహాకూటమి కూకట్ పల్లి అభ్యర్థి, టీడీపీ నేత నందమూరి సుహాసిని ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సుహాసిని నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె వెంట నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, నేతలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి భారీఎత్తున టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు.

నామినేషన్ దాఖలు అనంతరం సుహాసిని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం బాలయ్యతో పాటు మిగతా కుటుంబ సభ్యులతో కలిసి నందమూరి సుహాసిని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలను కోరారు. తాను గెలిస్తే కూకట్ పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు.
Go Back to Shorts
Telangana
kukatpalli
nandamuri suhasini
nomination
submitted
returning officer

More Telugu News