Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆస్తులు, కేసుల వివరాల వెల్లడి!

  • ఓటుకు నోటు కేసుతో పాటు మొత్తం 36 కేసులు
  • చరాస్తులు రూ. 1,74,97,421... స్థిరాస్తులు రూ. 2,02,69,000
  • ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న రేవంత్ రెడ్డి
తనపై ఓటుకు నోటు కేసుతో పాటు మొత్తం 36 కేసులు ఉన్నాయని కాంగ్రెస్ నేత, కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.  కేసుల్లో ఎక్కువ భాగం శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తారనే అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా 151 సీఆర్పీసీ కింద నమోదు చేసినవే ఉన్నాయి. ప్రైవేట్ మెడికల కాలేజీల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ముడుపులు తీసుకున్నారని ఆరోపించిన అంశంపై కూడా కేసులున్నాయి.

అఫిడవిట్ లో రేవంత్ వెల్లడించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. రేవంత్ పేరిట చరాస్తులు రూ. 1,74,97,421... స్థిరాస్తులు రూ. 2,02,69,000 ఉన్నాయి. ఆయన భార్య పేరిట చరాస్తులు రూ. 2,27,79,935... స్థిరాస్తులు రూ. 2,36,40,000 ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం ఆయన పేరిట రూ. 7,89,69,650 విలువైన ఆస్తులు... ఆయన భార్య పేరిట రూ. 9,44,64,000 విలువైన ఆస్తులు ఉన్నాయి.
Revanth Reddy
affidavit
cases
assets
congress
kodangal

More Telugu News