Andhra Pradesh: కూకట్ పల్లి రాజకీయం.. ఈరోజు మీడియాతో మాట్లాడనున్న నందమూరి సుహాసిని!

  • టీడీపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు
  • సహకరించాలని స్థానిక నేతలకు సూచన
  • ప్రత్యామ్నాయ పదవులతో ఆదుకుంటామని హామీ
ప్రముఖ నటుడు, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కూకట్ పల్లి టికెట్ ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తన రాజకీయ అరంగ్రేటం సహా పలు అంశాలపై ఈ సందర్భంగా సుహాసిని మీడియా ప్రతినిధులతో ముచ్చటించనున్నారు. కాగా, రేపు టీడీపీ తరఫున సుహాసిని నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ కుటుంబానికి టికెట్ ఇస్తున్నందున అందరూ మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను కోరారు. కాగా, కూకట్ పల్లి టికెట్ పై ఆశలు పెట్టుకున్న నేతలు పెద్దిరెడ్డి, మందాడి శ్రీనివాసరావు, ప్రేమకుమార్ తో బాబు మాట్లాడారు. సుహాసిని గెలుపుకు సహకరించాలనీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయ పదవులు ఇచ్చి ఆదుకుంటామని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు.
Andhra Pradesh
Telangana
nandamuri
harikrishan
nandamuri suhasini
media
Chandrababu
Telugudesam

More Telugu News