Sankranti: అప్పుడే మొదలైన కోడి పందేల సందడి... ఆన్ లైన్ లో కోళ్లు!

  • రెండు నెలల ముందే పందేల సందడి
  • కోళ్ల ఫోటోలు ఆన్ లైన్లో ఉంచుతున్న పందెంరాయుళ్లు
  • రూ. 50 వేల వరకూ పలుకుతున్న ధర

సంక్రాంతి పండగ వచ్చిందంటే, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కోడి పందేల విషయంలో... ఈ దఫా పందెం కోళ్ల సందడి ఆన్ లైన్లో ఇప్పటికే మొదలైంది. తాము పెంచుతున్న పందెం కోళ్ల ఫోటోలను ఆన్ లైన్లో ఉంచుతున్న పందెం రాయుళ్లు, రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకూ ధర చెబుతున్నారు. కోడి రకం, రంగును బట్టి ఈ ధర మారుతూ  ఉంది.

చుట్టూ కంచెను వేసి, కోళ్లను పెంచుతున్నట్టు బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, పేరం పేట, శ్రీనివాసపురం, లక్కవరం, వెంకటాపురం, నాగుల గూడెం, గుర్వాయగూడెం, తదితర ప్రాంతాల్లోని ఆయిల్ ఫామ్ తోటల్లో కోళ్లను పెంచుతూ, వాటి చిత్రాలను, ధర వివరాలను ఆన్ లైన్లో ఉంచుతుండగా, ఇప్పటి నుంచే విక్రయాలు జోరుగా సాగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.

More Telugu News