కేటీఆర్ ఎక్కువ మాట్లాడుతున్నారు.. బండారం బయటపెడతా: వీహెచ్
- నాలుగున్నరేళ్లుగా ఉద్యోగాలను ఎందుకు ఇవ్వలేకపోయారు?
- రాఫెల్ కుంభకోణంపై రేపు ధర్నా చేస్తాం
- ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ధర్నా కొనసాగుతుంది
నాలుగున్నరేళ్లుగా ఉద్యోగాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై రేపు ధర్నా చౌక్ లో ధర్నా చేస్తామని చెప్పారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ధర్నా కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.