seetharam naik: రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారు.. మరోసారి ఇలా చేస్తే కేసులు పెడతా: సీతారాంనాయక్

షార్ట్స్‌లో చూడండి
ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని టీఆర్ఎస్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. టీఆర్ఎస్ శ్రేణులను ఆత్మరక్షణలో పడేసేందుకు... రేవంత్ రెడ్డి ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఆ ఇద్దరి ఎంపీల పేర్లు చెప్పాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఏందో అందరికీ తెలుసని... ఇలాంటి చిల్లర వేషాలను ప్రజలు నమ్మరని చెప్పారు. తాను టీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని... మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రేవంత్ పై కేసులు పెడతానని అన్నారు.

ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని... కేసీఆర్ కు దమ్ముంటే వారిని కాంగ్రెస్ లో చేరకుండా అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరనున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో, ఆ వార్తలను సీతారాంనాయక్ మీడియా ముఖంగా ఖండించారు. 
Go Back to Shorts
seetharam naik
revanth reddy
TRS
congress

More Telugu News