t-congress: కాంగ్రెస్ పార్టీకి సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

  • రాజేంద్రనగర్ సీటు దక్కకపోవడంతో అసంతృప్తి
  • నాకు సీటిస్తారా? లేక రాజీనామా ఆమోదిస్తారా?
  • మహాకూటమి పేరిట రమణ టికెట్లు అమ్ముకున్నారు
కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు  కార్తీక్ రెడ్డికి సీటు దక్కని విషయం తెలిసిందే. దీంతో, మనస్తాపం చెందిన ఆయన, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజేంద్రనగర్ సీటిస్తారో లేక తన రాజీనామా ఆమోదిస్తారో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని అన్నారు. రాజేంద్రనగర్ లో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీకి రాజీనామా చేస్తారని హెచ్చరించారు. మహాకూటమి పేరిట టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. కాగా, స్వతంత్ర అభ్యర్థిగా కార్తీక్ రెడ్డి బరిలోకి దిగే యోచనలో ఉన్నట్టు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది. 
t-congress
mahakutami
sabita indra reddy
karthik reddy

More Telugu News