kv rao: కేవీ రావుపై అమెరికా ప్రభుత్వానికి, ఎఫ్బీఐకి ఫిర్యాదు చేస్తా: పవన్ కల్యాణ్

  • సినిమా థియేటర్ నడుపుకునే కేవీ రావుకు.. కాకినాడ పోర్టు ఎలా వచ్చింది?
  • అక్రమాల్లో చంద్రబాబు, జగన్ లకు వాటాలు ఉన్నాయనే అనుమానం కలుగుతోంది
  • మత్స్యకారులను కేవీ రావు వేధిస్తున్నారు
కాకినాడ పోర్టు యజమాని కేవీ రావుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోర్టులో చాలా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అక్రమాల గురించి తెలిసినా ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ లు మౌనంగా ఉన్నారని... వారి మౌనం చూస్తుంటే ఈ అక్రమాల్లో వారికి కూడా వాటాలు ఉన్నాయనే అనుమానం కలుగుతోందని అన్నారు. కేవీ రావు ఒక చిన్న సినిమా థియేటర్ ను నడుపుకునేవారని... అలాంటి వ్యక్తికి సీపోర్టు ఎలా వచ్చిందో తేలుస్తానని చెప్పారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కేవీ రావు... మత్స్యకారులను కూడా వేధిస్తున్నారని మండిపడ్డారు. కేవీ రావు అమెరికాలో ఉంటారని... ఆయనపై అమెరికా ప్రభుత్వానికి, ఎఫ్బీఐకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
kv rao
kakinada port
Chandrababu
jagan
Pawan Kalyan
america

More Telugu News