chiranjeevi: చిరూ ముందుకు 'వినయ విధేయ రామ' రఫ్ కట్!

  • చరణ్ హీరోగా బోయపాటి మూవీ 
  • చిరూకు చూపించనున్న రఫ్ కట్
  • అరగంట నిడివి తగ్గించే ఛాన్స్  
బోయపాటి దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' నిర్మితమవుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రెండుపాటలు మినహా షూటింగు పూర్తి కావడంతో, బోయపాటి 3 గంటలకి పైగా నిడివి కలిగిన రఫ్ కట్ రెడీ చేశాడట. ఇప్పుడు దీనిని చిరంజీవికి చూపించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చిరంజీవి మంచి ఎడిటర్ అనే విషయం తెలిసిందే. చరణ్ సినిమాలకి సంబంధించి ఆయన ఎడిటింగ్ టేబుల్ దగ్గర తప్పకుండా కూర్చుంటారు. కథ వేగంగా .. బిగువుగా నడవడానికి అడ్డుపడే సీన్స్ ను ఆయన లేపేస్తుంటారు. బోయపాటి రెడీ చేసిన నిడివిలో నుంచి చిరూ ఒక అరగంట నిడివినైనా తగ్గించవలసి ఉంటుంది. చిరూ కత్తిరింపులో ఏయే సీన్స్ ఎగిరిపోతాయో? 
chiranjeevi
boyapati

More Telugu News