వెంటాడిన పోకిరీలను ధైర్యంగా పట్టించిన కాలేజీ అమ్మాయి!

  • ముంబై, అంధేరీ ప్రాంతంలో ఘటన
  • కాలేజీ నుంచి వెళుతుంటే వెంటాడి వేధింపులు
  • డైరెక్టుగా స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు
తన వెంటపడిన ముగ్గురు ఆకతాయిలను ధైర్యంగా ఎదుర్కొని వారిని పోలీసులకు పట్టించిందో కాలేజీ విద్యార్థిని. ఈ ఘటన ముంబైలోని అంధేరీ ప్రాంతంలో జరిగింది. 19 సంవత్సరాల యువతి, ఆటోలో కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న వేళ, ముగ్గురు యువకులు కారులో అమెను వెంబడించారు. అసభ్యంగా మాట్లాడుతూ వేధించారు. ఆటోను వెంటాడారు.

వారి ఆట కట్టించాలని నిర్ణయించుకున్న ఆ అమ్మాయి, పోకిరీలు ప్రయాణిస్తున్న కారు నంబరును నోట్ చేసుకుని, అదే ఆటోలో జుహూ పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, కారును వెంబడించి వారిని అరెస్ట్ చేశారు. వీరు విజయ్ రాణ్, వికాస్, స్ట్రాహాన్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు. వేధింపులపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన అమ్మాయిని అధికారులు అభినందించారు.
Go Back to Shorts
Mumbai
College Girl
Harrasment
Police
Arrest

More Telugu News