harish shankar: మరో రీమేక్ తో రంగంలోకి దిగుతోన్న హరీశ్ శంకర్

  • 'దువ్వాడ' తరువాత వచ్చిన గ్యాప్ 
  • వర్కౌట్ కాని 'దాగుడుమూతలు'
  • 'జిగర్తాండ' రీమేక్ పై దృష్టి  

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా హరీశ్ శంకర్ కి మంచి క్రేజ్ వుంది. 'దువ్వాడ జగన్నాథం' ఓ మాదిరిగా ఆడటంతో, ఆ తరువాత ప్రాజెక్టును వెంటనే పట్టాలెక్కించలేకపోయాడు. 'దాగుడు మూతలు' టైటిల్ తో ఒక మల్టీ స్టారర్ ను ప్లాన్ చేశాడు గానీ, నిర్మాతలు ముందుకు రాకపోవడం వలన ఆగిపోయింది. దాంతో ఆయన 14 రీల్స్ బ్యానర్ పై ఓ తమిళ హిట్ మూవీని రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

 గతంలో 'దబాంగ్' హిందీ మూవీని 'గబ్బర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అలాగే ఇప్పుడు తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'జిగర్తాండ' సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ రీమేక్ కి సంబంధించిన విషయాలను హరీశ్ శంకర్ త్వరలోనే ప్రకటించనున్నాడట. 

More Telugu News