Chandrababu: టీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహం.. ఈ నెల చివర్లో రాహుల్‌తో కలిసి తెలంగాణలో చంద్రబాబు రోడ్‌ షోలు

  • ఈ నెలాఖరులో రోడ్‌ షోలు
  • 18 నియోజకవర్గాల్లో ప్రచారం
  • సిద్ధమవుతున్న రూట్ మ్యాప్

మహాకూటమిగా ఏకమైన ప్రతిపక్షాలు తెలంగాణలో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తుండగా, ఇప్పుడు మరో సవాలు విసిరేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులో హైదరాబాద్ సహా చుట్టుపక్కల ఉన్న 18 నియోజకవర్గాల్లో ఇద్దరూ ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో ప్రచారం చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు.. రాహుల్‌తో కలిసి రోడ్‌ షోలలో పాల్గొనబోతున్నారు. ఇందుకోసం నేతలు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.

టీడీపీ-కాంగ్రెస్ నేతలు చెబుతున్నదాని ప్రకారం.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేట, మేడ్చల్‌, పటాన్‌చెరు, గోషామహల్‌, మలక్‌పేట అసెంబ్లీ నియోజక వర్గాలతోపాటు శివారు సెగ్మెంట్లలోనూ చంద్రబాబు-రాహుల్ గాంధీ రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇందుకోసం నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

More Telugu News