TRS: టీఆర్ఎస్ ఎంపీలిద్దరు మా పార్టీలో చేరబోతున్నారు: రేవంత్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఎవరెన్ని కుట్రలు చేసినా కొడంగల్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తనకు ముప్పై వేల మెజార్టీ రావడం ఖాయమని చెప్పిన రేవంత్, ఈ నెల 19న నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, టీఆర్ఎస్ కు ప్రజలు తగినబుద్ధి చెబుతారని అన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎంపీలు త్వరలో తమ పార్టీలో చేరనున్నారని అన్నారు. ఎన్నికలు జరిగే లోపు వాళ్లిద్దరూ తమ పార్టీలో చేరతారని వ్యాఖ్యానించారు. 
Go Back to Shorts
TRS
Congress
Revanth Reddy

More Telugu News