john hastings: అంతుచిక్కని వ్యాధి కారణంగా.. క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్

  • ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న జాన్ హేస్టింగ్స్
  • బౌలింగ్ వేసిన ప్రతిసారి రక్తపు వాంతులు
  • భరోసా ఇవ్వలేకపోతున్న డాక్టర్లు

అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ (33) అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఊపిరితిత్తుల సమస్యతో హేస్టింగ్స్ బాధపడుతున్నారు. దీని కారణంగా బౌలింగ్ వేసిన ప్రతిసారి రక్తపు వాంతులు చేసుకుంటున్నాడు. అతనికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు కూడా వ్యాధి తగ్గుతుందన్న భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో, తాను ఎంతో ప్రేమించే క్రికెట్ కు అతను వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.

ఊపిరితిత్తుల పరిస్థితి కారణంగా క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నానని ఈ సందర్భంగా హేస్టింగ్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. 2007లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన హేస్టింగ్స్... ఆస్ట్రేలియా జట్టుతో పాటు, పలు లీగ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా తరపున ఒక టెస్టు, 29 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, కోచి టస్కర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

More Telugu News