Telangana: మహాకూటమి జాబితా అమరావతిలో తయారవుతోంది.. హుజూర్ నగర్ నుంచి నేను పోటీ చేస్తున్నా!: చెరకు సుధాకర్

  • ఉద్యమకారులకు మళ్లీ అన్యాయం
  • ఈ జాప్యానికి కోదండరాం, ఉత్తమ్ లే కారణం
  • సామాజిక న్యాయాన్ని పట్టించుకోలేదు

2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి మరోసారి ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్నాయని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ ఆరోపించారు. మండిపడ్డారు. ప్రజా కూటమి(మహాకూటమి) పొత్తులో భాగంగా తమకు ఓ సీటును ఇంకా కేటాయించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మహాకూటమి అభ్యర్థుల జాబితా ఇప్పుడు అమరావతిలో తయారవుతోందని సుధాకర్ విమర్శించారు. సీట్ల కేటాయింపులో కాంగ్రెస్-టీడీపీలు సామాజిక న్యాయాన్ని గాలికి వదిలేశాయని ఆరోపించారు. టీజేఎస్ చీఫ్ కోదండరాం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణంగానే సీట్ల కేటాయింపులో జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఏదేమైనా తాను హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. 

More Telugu News