rajani: '2.ఓ' నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్

  • రిలీజ్ కి ముస్తాబవుతోన్న '2.ఓ'
  • అభిమానుల్లో పెరుగుతోన్న అంచనాలు 
  • హిట్ కోసం ఎమీ జాక్సన్ వెయిటింగ్    

ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ '2.ఓ' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి రెండవ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "రండాలి .. రండాలి .. రా మరి .. నువ్వో నేనో ఉండాలి. రండాలి .. రండాలి .. నూరేళ్లు నీకు నిండాలి" అంటూ ఈ పాట కొనసాగుతోంది.

ప్రతినాయక పాత్రను ఉద్దేశించిన నేపథ్యంలో ఈ పాట వస్తుందని అర్థమవుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకాన్ని రజనీకాంత్ వ్యక్తం చేసిన దగ్గర నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమా కోసమే పూర్తి సమయాన్ని కేటాయించిన ఎమీ జాక్సన్, భారీ సక్సెస్ తప్పదనే భావిస్తోంది. ఆమె కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. 

More Telugu News