రాజస్థాన్‌లో బీజేపీ ప్రయోగాల బాట.. 25 మంది సిట్టింగులకు షాక్
- 131 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
- 21 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి
- 12 మంది మహిళలకు చోటు
రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా 131 మంది అభ్యర్థుల జాబితాను తొలి విడతలో బీజేపీ ప్రకటించింది. ముఖ్యమంత్రి వసుంధర రాజే ఎప్పుడూ పోటీ చేసే ఝల్రాపతన్ నుంచే పోటీలో ఉన్నారు. అలాగే, సిట్టింగ్ ఎంపీ అయిన సోనారామ్ చౌదరి ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. బీజేపీ విడుదల చేసిన తొలి విడత జాబితాలో 12 మంది మహిళలు, 19 మంది ఎస్టీలు, 17 మంది ఎస్సీలు ఉన్నారు.