Andhra Pradesh: ముంచుకొస్తున్న మరో తుపాను.. తీరం వెంబడి బలమైన గాలులు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

  • మరో 24 గంటల్లో బలపడనున్న తుపాను
  • జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
  • అన్ని పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ

చెన్నైకి 720 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో  కేంద్రీకృతమైన ‘గజ’తుపాను మరో 24 గంటలలో మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 15న కడలూరు, పాంబన్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఆ సమయంలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, జాలర్లు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

ప్రస్తుతం అన్ని పోర్టులలోనూ రెండో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడతాయని, తీరం వెంబడి ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలోనూ పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

More Telugu News