vijay: 200 కోట్ల క్లబ్ లో 'సర్కార్' .. ఓవర్సీస్ లో 6 రోజుల వసూళ్లు

  • విజయ్ హీరో గా 'సర్కార్'
  • తమిళనాట విజయవిహారం 
  • రికార్డుస్థాయి వసూళ్లు          

విజయ్ హీరోగా మురుగ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' .. ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, వసూళ్లపరంగా తన జోరు కొనసాగిస్తోంది. తెలుగు .. తమిళనాడు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది.6 రోజుల్లో ఈ సినిమా యూఎస్ ఏలో 6.62 కోట్లు .. యూకేలో 3.63 కోట్లు .. ఆస్ట్రేలియాలో 2.21కోట్లు .. న్యూజిలాండ్ 20.05 లక్షలు .. యూఏఈ/జిసీసీలో కలుపుకుని 5 రోజుల్లో ఈ సినిమా 15.66 కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా  200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయి సంచలనాన్ని సృష్టించింది.         

More Telugu News