Vijay Devarakonda: భయపెడుతూ వచ్చేసిన 'టాక్సీవాలా'... ట్రయిలర్ చూడండి!

  • ఈ నెల 17న విడుదలకు సిద్ధమైన 'టాక్సీవాలా'
  • ట్రయిలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్
  • అలరిస్తున్న విజయ్ దేవరకొండ డైలాగులు

పలు వాయిదాల తరువాత విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' ఈ నెల 17న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం పాటలు హిట్ టాక్ తెచ్చుకోగా, నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో చిత్రం ట్రయిలర్ ను విడుదల చేశారు. ఇప్పటికే ఏడున్నర లక్షల మందికి పైగా వీక్షించిన ఈ ట్రయిలర్ ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. ఈ ట్రయిలర్ ఆరంభంలో హారర్ సీన్ భయపెట్టేలా ఉండగా, 'నీ యబ్బ... జాబ్ చూడరా అంటే జిమ్నాస్టిక్స్ చేయిస్తావేంట్రా' అంటున్న విజయ్ డైలాగ్ అలరిస్తోంది.

ఆపై అతను ఓ కారును కొనడం, టాక్సీవాలాగా మారడం, హీరోయిన్ తో పరిచయం, ఆమె మందు కొట్టి పడిపోతే, "నేను మంచోడిని కాబట్టి సరిపోయింది కానీ..." అంటున్న విజయ్ కనిపిస్తున్నాడు. ఆపై ఓ పాట, కొన్ని సీన్స్, ఇందులో చూపారు. "ఇది వినడానికి విచిత్రంగానే ఉంటది. కానీ నమ్మండి"... "కారులో దెయ్యం ఉంది" అని విజయ్ చెప్పడం సినిమా హారర్ జోనర్ ను టచ్ చేసింది. ఆ ట్రయిలర్ ను మీరూ చూడండి.

More Telugu News