ఎంత అదృష్టం... 24 గంటల వ్యవధిలో మూడు లాటరీలు కొట్టిన అమెరికన్!
- న్యూయార్క్ వాసి రాబర్ట్ స్టీవర్ట్ కు లాటరీ
- మూడు లాటరీల్లో విజేత
- రూ. 36.24 కోట్ల డబ్బు
ఈ విషయాన్ని ఆయన మీడియాకు చెబుతూ, స్క్రాచ్ లాటరీ గేమ్ లో 50 లక్షల డాలర్లు, రెండోసారి 500 డాలర్లు, మూడోసారి 7,276 డాలర్లను తాను గెలుచుకున్నానని చెప్పాడు. ఆగస్టు 2న ఈ ఘటన జరిగిందని లాటరీ నిర్వాహకులతో తన పేరును బయట పెట్టవద్దని కోరానని చెప్పిన ఆయన, ఇప్పటికి బయట పెట్టాడు. ప్రస్తుతం ఆ డబ్బును తన కుటుంబానికి, వ్యాపారాభివృద్ధికి వాడుకుంటున్నానని చెప్పాడు. కాగా, ఈ సంవత్సరం ఆరంభంలో అతనికి మరో లాటరీలో 2,500 డాలర్లు లభించడం గమనార్హం.