petrol: నేడూ తగ్గిన పెట్రోలు ధరలు.. ఈసారి బహు స్వల్పం

  • వరుసగా తగ్గుతూ వస్తున్న పెట్రో ధరలు
  • నేడు పెట్రోలుపై 17, డీజిల్‌పై 15 పైసలు తగ్గుదల
  • ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 77.56

గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్న పెట్రో ధరలు నేడు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే, ఈసారి చాలా స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోలుపై 17 పైసలు తగ్గింది. ఫలితంగా రూ.77.56కు చేరుకుంది. డీజిల్‌పై లీటరుకు 15 పైసలు తగ్గడంతో రూ.72.31కి చేరుకుంది. ముంబైలో లీటరు పెట్రోలుపై 17 పైసలు, డీజిల్‌పై 16 పైసలు తగ్గింది. ఫలితంగా లీటరు పెట్రోలు ధర రూ. 83.07, డీజిల్ ధర రూ.75.76కు చేరుకుంది.  

ఇటీవల దేశంలో ఎన్నడూ లేనంతగా పెట్రోలు ధరలు పెరుగుతూ పోవడంతో వాహనదారుల జేబులు చిల్లులు పడ్డాయి. పెట్రో ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. వాహనదారుల అవస్థలపై స్పందించిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నుల్లో కొంత వాటాను తగ్గించడంతో కొంత ఊరట లభించింది. రాష్ట్రాలు తమ పన్నులను తగ్గిస్తుండడంతో కేంద్రం కూడా దిగివచ్చింది. అక్టోబరు 4న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పెట్రోలు, డీజిల్‌పై రూ. 2.50 తగ్గించారు.

More Telugu News