Andhra Pradesh: అనంతపురంలో టీడీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన పరిటాల సునీత అనుచరుడు!

  • మాజీ ఎమ్మెల్యే వెంకట్రాముడు రాజీనామా
  • టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై ఆగ్రహం
  • ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని వ్యాఖ్య
అనంతపురంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు, పరిటాల సునీత ముఖ్య అనుచరుడు చిలకం మధుసూదన్ రెడ్డి ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు మాట్లాడుతూ.. తాము 1989 నుంచి టీడీపీకి సేవలు అందిస్తున్నామని తెలిపారు.

అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా చంద్రబాబు నిర్ణయం  తీసుకున్నారని విమర్శించారు. తమ రాజకీయ భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యవహారంపై జిల్లా టీడీపీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు.
Andhra Pradesh
Anantapur District
Telugudesam
resign
paritala
ntr
Chandrababu
Congress

More Telugu News