trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • విశాల్ దర్శకత్వంలో త్రిష!
  • స్క్రీన్ ప్లే సమకూర్చిన తరుణ్ భాస్కర్
  • 'భారతీయుడు 2'లో దుల్కర్ సల్మాన్ 
  • 'మహర్షి' కోసం విలేజ్ సెట్

*  ప్రముఖ కథానాయకుడు విశాల్ త్వరలో దర్శకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. జంతువుల కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో అందాలతార త్రిష కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.
*  పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది? చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ తాజాగా ఓ వెబ్ సీరీస్ కి స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నాడు. ఈ వెబ్ సీరీస్ 'బీ.టెక్' పేరిట వస్తోంది.
* కమలహాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందే 'భారతీయుడు 2' చిత్రంలో యువ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఇతనికి జంటగా కాజల్ నటిస్తుందట.  
*  మహేశ్ బాబు నటిస్తున్న 'మహర్షి' చిత్రం కోసం హైదరాబాదులోని ఓ స్టూడియోలో విలేజ్ సెట్ ను వేశారు. ఈ సెట్లో త్వరలో షూటింగును ప్రారంభించి 25 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు.

More Telugu News