Telugudesam: టికెట్ లొల్లి.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత

  • టీడీపీ టికెట్ల కోసం తీవ్రమైన పోటీ
  • ఎల్బీనగర్ టికెట్ తమకే ఇవ్వాలంటూ సామ రంగారెడ్డి వర్గీయుల ఆందోళన
  • గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీడీపీ తరపున గెలిచిన ఆర్.కృష్ణయ్య
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీకి 14 స్థానాలను కాంగ్రెస్ కేటాయించింది. మరో రెండు స్థానాలు కావాలని టీటీడీపీ నేతలు కోరుతున్నారు. మరోవైపు, టీడీపీలో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో, టీడీపీ టికెట్ల కోసం పోటీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో, ఎల్బీనగర్ టికెట్ ను తమకే కేటాయించాలని సామ రంగారెడ్డి అనుచరులు హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. పామ రంగారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఆర్.కృష్ణయ్య టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే, టీడీపీ కార్యక్రమాలకు చాలా కాలంగా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో, నియోజకవర్గంలో పార్టీ కేడర్ ను కాపాడుకుంటూ వస్తున్న తమకే టికెట్ ఇవ్వాలని రంగారెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Telugudesam
ticket
lb nagar
sama rangareddy
ntr trust bhavan

More Telugu News