kcr: చినజీయర్ ఆశ్రమంలో యాగాన్ని నిర్వహించిన కేసీఆర్

  • శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని ఆశ్రమంలో యాగం
  • చినజీయర్ ఆశీర్వచనాలను తీసుకున్న కేసీఆర్
  • ఎన్నికల నేపథ్యంలోనే యాగం చేశారంటూ వార్తలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగంలో పాల్గొన్నారు. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఆయన యాగాన్ని నిర్వహించారు. చినజీయర్ స్వామి ఈ యాగాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చినజీయర్ ఆశీర్వచనాలను కేసీఆర్ తీసుకున్నారు. కేసీఆర్ కు భక్తిభావం ఎక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. వాస్తును కూడా ఆయన ఎక్కువగా నమ్ముతారు. గతంలో లో కూడా ఆయన యాగాలను నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలోనే, తాజాగా ఆయన యాగాన్ని నిర్వహించారని చెబుతున్నారు. 
kcr
yagam
china jeeyar
elections

More Telugu News