charan: కొత్త రికార్డును నమోదు చేసిన 'వినయ విధేయ రామ' టీజర్

  • చరణ్ టీజర్ కి మంచి రెస్పాన్స్
  • మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు  
  • 24 గంటల్లోనే సొంతమైన కొత్త రికార్డ్       

బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' సినిమా రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఆ దిశగానే చకచకా పనులను పూర్తిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను వదిలారు. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

మాస్ ఆడియన్స్ నుంచి ఈ టీజర్ మంచి మార్కులు దక్కించుకుంది. ఈ టీజర్ ను వదిలిన 24 గంటల్లో 15.1 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను రాబట్టింది. తెలుగులో ఒక్క రోజులోనే ఈ స్థాయి వ్యూస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇంతవరకూ ఇదొక్కటేనని చెబుతున్నారు. చరణ్ సినిమా తొలి విడతలోనే కొత్త రికార్డును నమోదు చేయడం పట్ల అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.    

More Telugu News