anjali: మరో హారర్ థ్రిల్లర్ మూవీలో అంజలి

  • అంజలికి మంచి క్రేజ్
  • నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు
  • బహు భాషల్లో విడుదల  

తెలుగు .. తమిళ భాషల్లో అంజలికి మంచి క్రేజ్ వుంది. ఒక వైపున కథానాయికగా చేస్తూనే, మరో వైపున నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ తరహా సినిమాలన్నీ కూడా హారర్ నేపథ్యంతో కూడినవి కావడం విశేషం. తాజాగా ఆమె మరో హారర్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది .. ఆ సినిమా పేరే 'లిసా'. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.    ఇంతవరకూ వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాలకి .. ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. డిఫరెంట్ లుక్స్ తో ఈ సినిమాలో అంజలి కనిపించనుంది. తమిళంలో రూపొందుతోన్న ఈ సినిమాను, తెలుగు .. మలయాళ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఫస్టు స్టీరియోస్కోపిక్ 3D గా రూపొందిన ఈ సినిమాను క్రిస్మస్ కి విడుదల చేయనున్నారు. మందకొడిగా సాగుతోన్న అంజలి కెరియర్, ఈ సినిమాతో ఊపందుకుంటుందేమో చూడాలి.   

More Telugu News