ఎవరు అడిగినా నా ఆస్తుల వివరాలు ఇస్తా.. తప్పు చేసుంటే ఎంక్వైరీ చేయాలని నేనే ఎందుకు లేఖ రాస్తా?: మంత్రి గంటా
- నా ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కుట్ర
- రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారు
- విశాఖ భూ కుంభకోణంపై చర్చకు సిద్ధం
ఈ విషయంలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉంటానని గంటా శ్రీనివాసరావు తెలిపారు. తాను తప్పుచేయలేదన్న నమ్మకం ఉంది కాబట్టే సీబీఐ లేదా సిట్ వేసి విచారణ జరపాలని స్వయంగా సీఎంకు లేఖ రాశారన్నారు. తన ఇమేజ్ ను దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ఈ కుట్ర జరిగిందని గంటా ఆరోపించారు.