Sarkar: 'సర్కార్'లో జయలలితను తప్పుగా చూపారట... తమిళనాట నిరసనలు!

  • హిట్ టాక్ తెచ్చుకున్న 'సర్కార్'
  • దివంగత జయలలితను కించపరిచారు
  • అన్నాడీఎంకే నేతల ఆరోపణ

ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న విజయ్ 'సర్కార్'పై తమిళనాడులో కొత్త వివాదం చోటుచేసుకుంది. రాజకీయాలు, ఓటు హక్కు ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, ఇందులో దివంగత జయలలితను తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు మండిపడుతున్నారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ, పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. వెంటనే ఆ సన్నివేశాలు తొలగించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కాగా, విజయ్ గత చిత్రం మెర్సెల్ (తెలుగులో అదిరింది)లో భారత ప్రభుత్వ వ్యవస్థ, జీఎస్టీపై చిత్రించిన సన్నివేశాలను తొలగించారన్న సంగతి తెలిసిందే. ఈ తాజా వివాదం ఎంతవరకూ వెళుతుందో?!

More Telugu News