Hyderabad: హైదరాబాద్ విమానం హైజాక్ కుట్ర... ఇంటెలిజన్స్ కు ఉప్పందడంతో తప్పిన పెను ప్రమాదం!

  • కాబూల్ కేంద్రంగా కుట్ర
  • స్పష్టమైన సంకేతాలిచ్చిన ఐబీ
  • అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్

శంషాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే ఓ విమానాన్ని హైజాక్ చేసి, కాశ్మీర్ లో పట్టుబడిన ఉగ్రవాదులను విడిపించుకునేందుకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. కాబూల్ కేంద్రంగా విమానం హైజాక్ కు కుట్ర పన్ని, భారత విమానాన్ని దారి మళ్లించేందుకు వ్యూహాలు పన్నగా, ఆ విషయం నిఘా వర్గాలకు తెలిసింది. దీంతో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు, ఎన్ఎస్జీ బృందాలు రంగంలోకి దిగాయి.

సర్వసాధారణంగా విమానాల హైజాక్ కు సంబంధించి ఇంటెలిజెన్స్, తరచూ జనరల్ ఎలర్ట్ ను ఇస్తుంటుంది. అయితే, ఐబీ నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం చాలా అరుదు. ఓ విమానాన్ని హైజాక్ చేయనున్నారని, ప్రయాణికులను అడ్డుపెట్టుకుని బేరసారాలు చేసి, ఉగ్రవాదులను విడిపించుకోవాలన్నది ఎల్టీఈ కుట్రని ఐబీ నుంచి సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్ సహా దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రస్తుతం రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ముందుగానే నిఘా వర్గాలకు సమాచారం అందడంతో, భద్రతను కట్టుదిట్టం చేసిన సీఐఎస్ఎఫ్, క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే ప్రయాణికులను విమానాశ్రయం లోపలికి పంపుతున్నారు. 

More Telugu News