Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు ఇది నా సలహా మాత్రమే: బీజేపీ నేత మాధవీలత

  • మీటింగ్స్ లో పవన్ తప్ప వేరేవాళ్లు మాట్లాడరే ?
  • పవన్ ని కలవాలంటే పడిగాపులు తప్పట్లేదట
  • ఎంతసేపూ పక్క పార్టీ లని విమర్శించడమే ఎందుకో?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు బీజేపీ నేత, ప్రముఖ నటి మాధవీ లత తన సలహా అంటూ ఓ పోస్ట్ చేశారు. జనసేన పార్టీ మీటింగ్స్ అన్నింటినీ తాను వింటున్నానని, ఆయా మీటింగ్స్ లో పవన్ కల్యాణ్ తప్ప, వేరే వాళ్లెవరైనా మాట్లాడారా అన్ని ప్రశ్నించారు. ఆయన పక్కన ఉన్న మహిళలు డమ్మీగా ఉండటమేంటి? అని ప్రశ్నించారు. ఇక, పవన్ కల్యాణ్ ను కలవాలంటే జనసేన పార్టీ కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని సీనియర్ జర్నలిస్ట్ లు, ఆయన్ని అభిమానించే వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పీఎం, సీఎం లను కలవడం తేలిక అని, పవన్ ని కలిసే మార్గం అర్థం కావట్లేదని తనకు తెలిసిన సమాచారమని అన్నారు.

‘అయ్యా ఇది విమర్శ కాదు సలహా మాత్రమే.. జనసేన మీటింగ్స్ అన్నీ ఫాలో అవుతున్నా, ఒక్క మీటింగ్ లో కూడా వేరేవాళ్లు మాట్లాడారా? 2 గంటలు 4 గంటలు కల్యాణ్ గారి మాటలేనా? పక్కన మహిళలు డమ్మీగా ఉండటం ఏంటి? ఎక్కడో ఎపుడో అలా అలా మాట్లాడి వెళ్తున్నారు. స్టేజ్ మీద మొదట నాయకుడి స్పీచ్ ఉండదు కానీ, ఇక్కడ ఎందుకు ఉంటుంది ఇంకా మాట్లాడే వారే లేదా? ఇంకా పోతే ఆయన్ని కలవాలీ అంటే జనసేన ఆఫీస్ దగ్గర వెయిటింగ్ వెయిటింగ్ అంట. ఇది సీనియర్ జర్నలిస్ట్స్ లు, ఆయన్ని అభిమానించే వాళ్ళు అసహనానికి గురై బాధతో చెప్పిన మాటలు.

సీఎంతో ఎలా కలవాలో సోర్స్ ఈజీగా ఉంది . పీఎం ని కలిసే విధానం క్లియర్ గా ఉంది. కానీ, పవన్ కల్యాణ్ గారిని కలిసే మార్గం అర్థం అవట్లేదు అని సమాచారం. ఇది అడ్మినిస్ట్రేషన్ లోపం ఉందని గమనించాలి. అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో క్లారిటీ ఉండటం లేదు స్పీచెస్ లో. ఎంతసేపూ పక్క పార్టీ లని విమర్శించడమే ఎందుకో? సరైన విధానం కాదు.. ద్వేషాలని రెచ్చగొట్టడం ఒకప్పటి రాజకీయం. మార్పు కావాలని వచ్చిన వారు కూడా అదే పాత చింతకాయ పచ్చడి తినడం నచ్చలేదు నాకు . ఇది నా అభిప్రాయం’ అని తన పోస్ట్ లో మాధవీ లత వ్యాఖ్యానించారు.

More Telugu News