బ్యాంకులను మోసం చేసి విదేశాలకు చెక్కేసిన మేహుల్ చౌక్సీ కుడిభుజం దీపక్ కులకర్ణి అరెస్ట్
- బ్యాంకాక్ నుంచి వస్తున్నట్టు పసిగట్టిన ఈడీ
- కోల్ కతా ఎయిర్ పోర్టులో అరెస్ట్
- చౌక్సీ సంస్థకు డైరెక్టర్ గా ఉన్న దీపక్
మేహుల్ చౌక్సీ హాంకాంగ్ లో నడుపుతున్న ఓ డబ్బా కంపెనీకి కులకర్ణి డైరెక్టర్ గా ఉన్నాడు. ఇతని ఆచూకీ కోసం గతంలో ఈడీ, సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇండియాకు వస్తున్నట్టు తెలుసుకుని అరెస్ట్ చేశామని ఈడీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.