Jagan: జగన్ భద్రత కోసం తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం!

  • ఇప్పటికే బులెట్ ప్రూఫ్ కారును సమకూర్చిన ప్రభుత్వం
  • ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూస్తాం
  • ప్రజలపై ఆంక్షలు లేకుండా 'రూట్ క్లియరెన్స్' సౌకర్యం
వైకాపా అధినేత వైఎస్ జగన్ కు భద్రత పెంచి, ఇప్పటికే ఓ బులెట్ ప్రూఫ్ కారును సమకూర్చిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. ఆయన హైదరాబాద్ లో ప్రయాణిస్తుంటే, ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. జగన్ కాన్వాయ్ వేగంగా గమ్యాన్ని చేరుకునేందుకు ఈ రూట్ క్లియరెన్స్ సహకరించనుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో వీవీఐపీలు పర్యటనలకు వచ్చినప్పుడు, గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు, నాయిని తదితర ప్రముఖులకు మాత్రమే ఈ రూట్ క్లియరెన్స్ అమలవుతుండగా, ఈ జాబితాలో జగన్ కూడా చేరారు. అయితే, జగన్ కాన్వాయ్ కోసం ఏ విధమైన కొత్త ఆంక్షలనూ విధించబోమని, ఆయన ప్రయాణించే రూట్ లో ట్రాఫిక్ జామ్ కాకుండా మాత్రమే చూస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. జగన్ కాన్వాయ్ లోని భద్రతను కూడా పెంచాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.
Jagan
Hyderabad
Police
Route Clearence

More Telugu News