మళ్లీ పాతరోజులు.. వస్తుమార్పిడి పద్ధతిలో గోవును కొనుగోలు చేసిన గుంటూరు వాసి
- గోవు ధర రూ.1.51 లక్షలు
- 90 క్వింటాళ్ల మొక్కజొన్నలు ఇచ్చి మార్పిడి చేసుకున్న వైనం
- ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవి తన ఇంటికి వచ్చిందన్న మురళీకృష్ణ
జిల్లాలోని కొల్లూరు మండల పరిధిలోని పోతర్లంకకు చెందిన ఈడ్పుగంటి కుటుంబరావుకు చెందిన గోవును వేమూరుకు చెందిన వేమూరు మురళీకృష్ణ వస్తు మార్పిడి రూపంలో 90 క్వింటాళ్ల మొక్క జొన్నలు ఇచ్చి కొనుగోలు చేశాడు. గోవు ధర రూ.1,51,200 కావడంతో ఆ మేరకు విలువైన మొక్కజొన్నలు ఇచ్చి ఆవును సొంతం చేసుకున్నాడు. ధన త్రయోదశి రోజున గోవు ఇంటికి రావడంతో సాక్షాత్తూ లక్ష్మీదేవే తన ఇంటికి వచ్చినట్టు భావిస్తున్నానని మురళీకృష్ణ ఆనందం వ్యక్తం చేశాడు.