‘జనతా గ్యారేజ్’ పేరుతో సెటిల్మెంట్లు, గుంటూరులో కత్తితో యువకుడి హల్ చల్!
- యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఘటన
- జనతా గ్యారేజ్ పేరుతో వాట్సాప్ గ్రూపు
జనతా గ్యారేజ్ సినిమాతో స్ఫూర్తి పొందిన ప్రదీప్ అనే యువకుడు తాడేపల్లి మండలం ఉండవల్లిలో రోడ్డుపై చేతిలో కత్తితో హల్ చల్ చేశాడు. ఇతను జనతా గ్యారేజ్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి ఎవరికైనా సమస్యలుంటే సెటిల్ చేస్తానని ప్రచారం చేస్తున్నాడు. గతంలో ఇతను పలు నేరాలకు పాల్పడినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రదీప్ ఉండవల్లిలో కత్తిని పట్టుకుని గట్టిగా ఫోన్ లో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో స్థానికులు ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న అధికారులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.