Telangana: తెలంగాణలో ఏర్పడింది ‘మహాకూటమి’ కాదు.. అది ఈస్టిండియా కంపెనీ!: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

  • విజయవాడలో ఉన్న చంద్రబాబు ఇక్కడ పాలించాలా?
  • మహాకూటమికి ఓటమి తప్పదు
  • ట్విట్టర్ లో మండిపడ్డ హైదరాబాద్ ఎంపీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏర్పాటైన మహాకూటమిపై ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఏర్పడింది మహాకూటమి కాదనీ, అది 2018లో ఏర్పడ్డ ఈస్టిండియా కంపెనీ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు విజయవాడలో ఉండే చంద్రబాబు, నాగ్ పూర్ లో ఉన్న ఆరెస్సెస్, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణను పాలిస్తాయా? అంటూ మండిపడ్డారు.  

ఈ రోజు ట్విట్టర్ లో ఒవైసీ స్పందిస్తూ.. ‘కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కలిసి ఏర్పడింది మహాకూటమి కాదు. ఇది 2018లో ఏర్పడ్డ ఈస్టిండియా కంపెనీ. ఎందుకో నేను మీకు చెబుతాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడింది. ఇప్పుడు నిర్ణయాలను విజయవాడలో కూర్చున్న చంద్రబాబు తీసుకోవాలా? లేక నాగ్ పూర్ లో కూర్చున్న ఆరెస్సెస్ పెద్దలు తీసుకోవాలా? లేక ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ నేతలు తీసుకుంటారా?’ అని ట్వీట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో మహాకూటమికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

More Telugu News