Ponguleti Sudhakar Reddy: ఆ త్యాగాలేవో సీనియర్లే చెయ్యొచ్చు కదా?: కాంగ్రెస్ నేత పొంగులేటి
- పోలవరం ప్రాజెక్టు ముంపుపై స్పష్టత ఇవ్వాలి
- కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు
- తెలంగాణలోని స్థానాలను ఎవరికీ కేటాయించలేదు
పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ముంపుపై స్పష్టత కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.
ఇప్పటి వరకూ తెలంగాణలోని స్థానాలను ఎవరికీ కేటాయించలేదన్నారు. కొన్ని స్థానాలను త్యాగం చేయాలని తమ పార్టీలోని సీనియర్ నేతలు చెబుతున్నారని.. అలా చెప్పడానికి ముందు వారే త్యాగాలు చేయాలని పొంగులేటి అన్నారు. మహాకూటమిలోని పార్టీలన్నీ సంయమనం పాటించాలన్నారు.