Congress: ‘కాంగ్రెస్’ వెనుక ఉండి చక్రాలు, బొంగరాలు, వడియాలు అన్నీ చంద్రబాబే తిప్పుతారట!: మంత్రి కేటీఆర్ వ్యంగ్యం

  • చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ దాసోహమంటోంది
  • ఆలేరు ‘కాంగ్రెస్’ అభ్యర్థిని డిసైడ్ చేసేది బాబేనట
  • ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా?
తుచ్ఛమైన అధికారం కోసం, నాలుగు సీట్ల కోసం, ఆయనిచ్చే నోట్ల కోసం చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ దాసోహమంటోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రినగర్ లో ఈరోజు నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, ఆలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రాహుల్ గాంధీ డిసైడ్ చేయరట, చంద్రబాబు డిసైడ్ చేస్తారట, ఇంతకన్నా సిగ్గుచేటు వ్యవహారం ఇంకేమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు.

ఈరోజున కాంగ్రెస్ పార్టీకి రచన, స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వం.. మొత్తం చంద్రబాబునాయుడే చేస్తాడట అంటూ సెటైర్లు విసిరారు. కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి చక్రాలు, బొంగరాలు, వడియాలు అన్నీ చంద్రబాబే తిప్పుతారట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
Congress
Chandrababu
KTR
yadadri

More Telugu News