ఇంకాస్త తగ్గిన పెట్రోలు ధరలు!
- 21 పైసల మేరకు తగ్గిన పెట్రోలు ధర
- 17 పైసలు తగ్గిన లీటర్ డీజిల్ ధర
- మరికొంతకాలం ఇలాగే అంటున్న నిపుణులు
ఇదే సమయంలో చెన్నైలో పెట్రోలు ధర రూ. 81.84, డీజిల్ ధర రూ. 77.55గా ఉండగా, కోల్ కతాలో పెట్రోలు ధర లీటరుకు రూ. 80.68, డీజిల్ రూ. 75.22 వద్ద కొనసాగుతున్నాయి. ధరల తగ్గుదల మరింత కాలం కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, గడచిన రెండు వారాల వ్యవధిలో పెట్రోలు ధర సుమారు రూ. 3.50, డీజిల్ ధర రూ.2 మేరకు తగ్గడం గమనార్హం.