మందుకొట్టి పట్టుబడ్డ పలువురు మహిళలు... నానా తంటాలూ పడ్డ పోలీసులు!
- హైదరాబాద్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్
- 6 ప్రాంతాల్లో తనిఖీలు
- పట్టుబడిన 108 మంది వాహన చోదకులు
పట్టుబడిన వారిలో కొందరు మహిళలు, తొలుత తనిఖీలకు, ఆపై వాహనాలు అప్పగించేందుకు నిరాకరించి పోలీసులకు సహకరించలేదు. తమను వీడియో తీస్తున్న మీడియాపైనా వారు తమ ప్రతాపాన్ని చూపారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు మహిళా పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. లా అండ్ ఆర్డర్ పోలీసులను పిలిపించిన అధికారులు, వారి వాహనాలన్నీ సీజ్ చేశారు. పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, ఆపై కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.