Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • విశాల్ తో జతకడుతున్న తమన్నా 
  • చైతూ, సమంతల కొత్త ప్రేమకథ!
  • రజనీకాంత్ సినిమాలో కీరవాణి పాట

*  తమిళ హీరో విశాల్ సరసన తమన్నా మరోసారి కథానాయికగా నటించనుంది. సుందర్ సి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది.
*  వివాహం తర్వాత నాగ చైతన్య, సమంత కలసి నటిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. దీని గురించి చైతూ చెబుతూ, ఈ సినిమా పరిపక్వత చెందిన ప్రేమకథ (మెచ్యూర్డ్ లవ్ స్టోరీ)తో రూపొందుతోందని చెప్పాడు.
*  రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో సీక్వెల్ '2.ఓ' చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఓ పాట పాడారు. 'బుల్లిగువ్వ..' అంటూ ఈ పాట సాగుతుంది. దీని గురించి సంగీత దర్శకుడు రెహ్మాన్ చెబుతూ, కీరవాణికి కృతజ్ఞతలు తెలిపాడు.

More Telugu News